మాట్లాడటం లేదని యువతి ఆత్మహత్య

0
130
Suicide

ఓ ప్రైవేట్ హాస్టల్ ఇద్దరమ్మాయిల మధ్య చిగురించిన ప్రేమ విషాదంగా ముగిసింది. ఈ ఘటన నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్పై వినోద్‌కుమార్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్‌కు చెందిన శ్రీనివాస్ కుమార్తె శ్రీదేవి(22), రాజన్న సిరిసిల జిల్లా, ఎల్లారెడ్డిపేటకు చెందిన అంజయ్య కుమార్తె నమ్రత(22)లు హిమాయత్‌నగర్‌లోని ఓ డిగ్రీ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్నారు. 2016 నుంచి 2018 డిసెంబర్ వరకు హిమాయత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఇద్దరు కలిసి ఉంటూ కాలేజీకి వెళ్లేవారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితికి చేరుకున్నారు. గత ఐదు నెలల క్రితం నమ్రత హాస్టల్ ఖాళీ చేసి స్వగ్రామానికి వెళ్లడంతో వారు ఇద్దరు కలువలేని పరిస్థితి ఏర్పడింది. నమ్రత తాను నీతో ఉండలేను అని చెప్పడంతో తీవ్ర మనస్తాపం చెందిన శ్రీదేవి వెంట తెచ్చుకున్న క్రిమిసంహహారక మందు తాగి అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో భయాందోళనకు గురైన నమ్రత, సాయికుమార్‌లు స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని శ్రీదేవిని చిక్సిత నిమిత్తం కింగ్‌కోఠిలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదర్‌గూడలోని ప్రైవేట్ దవాఖానకు తరలించగా చిక్సిత పొందుతూ ఆదివారం మృతి చెందింది. శ్రీదేవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం శ్రీదేవి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.