4,5 తేదీల్లో పవన్ కళ్యాణ్ గారి భీమవరం పర్యటన..

0
350

భీమవరం న్యూస్ : పవన్ కళ్యాణ్ గారికి తన అభిమానులన్నా కార్యకర్తలన్నా ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే.. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టం అందుకే పదే పదే మీటింగ్స్ లో జాగ్రత్తగా వెళ్లండీ అంటూ చెబుతూ ఉంటారు. భీమవరం నియోజిక వర్గం తాడేరుకు చెందిన మురళీక్రిష్ణ అనే జనసేన కార్యకర్త గత ఎన్నికల్లో చురుకుగా పాల్గొన్నడు. కాన్సర్ వ్యాధితో భాదపడుతూ కీమో తెరపీ చేయించుకుంటూ కూడా ఎన్నికల ప్రచారం లో పాల్గొని అందరినీ ఆశ్చర్య పరిచారు మురళీక్రిష్ణ. కీమో తెరపీ చేయించుకుంటూ కూడా పార్టీ కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారి గెలుపుకోసం పనిచేసిన కొప్పినీడు మురళీక్రిష్ణ మరణ వార్త విషయాన్ని శ్రీ.నాగబాబు గారు అధ్యక్షులవారి ద్రుష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయం విన్న పవన్ కళ్యాణ్ గారు చెలించిపోయి వారి కుటుంబాన్ని పరామర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకుగాను ఆగస్ట్ మొదటి వారంలో భీమవరం పర్యటనలో మురళీక్రిష్ణ కుటుంబాని పరామర్శించి ఆ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటారు. అనంతరం కార్యకర్తలతో మీటింగ్స్ లో పాల్గొంటారు..

Note : మురళీ క్రిష్ణ లాంటి కార్యకర్తను అందరూ ఆధర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నాము..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here