ఆగ‌స్ట్‌లో నాని ‘గ్యాంగ్ లీడ‌ర్’ …

0
160
nanigang

నేచుర‌ల్ స్టార్ నాని రీసెంట్‌గా జెర్సీ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన నాని ఆగ‌స్ట్ 30న గ్యాంగ్ లీడ‌ర్ చిత్రంతో థియేట‌ర్స్‌లోకి రానున్నాడు. తాజాగా ఈ విష‌యాన్ని మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. గ్యాంగ్ లీడ‌ర్ చిత్రం విక్రమ్ కే కుమార్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు, ఇందులో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ ప్ర‌తినాయ‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ప్రియాంక‌, ల‌క్ష్మీ , శ‌ర‌ణ్య‌, అనీష్ కురువిళ్ళా, ప్రియ‌ద‌ర్శి, ర‌ఘుబాబు, వెన్నెల కిషోర్, జైజా, స‌త్య త‌దిద‌రులు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇందులో అయిదుగురు అమ్మాయిలు దొంగ‌లుగా ఉంటారని వారికి నాయ‌కుడిగా నాని ఉంటారట‌. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిస్తున్నారు.