కోలీవుడ్‌లో శ్రియ రీఎంట్రీ

0
138
Shriya

దక్షిణాదిలో టాప్‌ హీరోయిన్లలో ఒకరు నటి శ్రియ. ముఖ్యంగా కోలీవుడ్‌లో చిన్నహీరో నుంచి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ వరకూ జత కట్టిన ఈ భామకు ఇటీవల అవకాశాలు తగ్గాయి. అలా అనడం కంటే శింబుకు జంటగా నటించిన అన్భానవన్‌ అసరాధవన్‌ అడంగాదవన్‌ చిత్రం తరువాత శ్రియకిక్కడ అవకాశాలు రాలేదు. అంతే కాదు టాలీవుడ్‌లోనూ అవకాశాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా కోలీవుడ్‌లో ఒక అవకాశం శ్రియ తలుపుతట్టింది. సైలెంట్‌గా నటుడు విమల్‌తో నటించేస్తోంది కూడా. ఇటీవల విమల్‌ నటించిన ఇవనుక్కు ఎంగేయో మచ్చం ఇరుక్కు చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. కాగా ప్రస్తుతం తనను హీరోగా నిలబెట్టిన కలవాని చిత్ర సీక్వెల్‌లో నటించాడు. సర్గుణం తెరకెక్కించిన ఈ చిత్రం పలు ఆటంకాలను ఎదుర్కొని ఎట్టకేలకు త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. ఇటీవల వ్యక్తిగతంగా సమస్యలను ఎదుర్కొన్న నటుడు విమల్‌ తాజాగా మరో చిత్రంలో నటిస్తున్నాడు. దీనికి సండకారి అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఆర్‌.మాదేశ్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నటి శ్రియ ఆయనకు జంటగా నటిస్తోంది. ఈ చిత్ర వివరాలను దర్శకుడు పూర్తిగా వెల్లడించకపోయినా, షూటింగ్‌ తొలి షెడ్యూల్‌ను సైలెంట్‌గా లండన్‌లో పూర్తి చేశారని తెలిసింది. రెండవ షెడ్యూల్‌ను రూరల్‌ ప్రాంతాల్లో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మావీరన్, సుర చిత్రాల ఫేమ్‌ దేవ్‌గిల్‌ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు. ఇకపోతే నటి శ్రియ విమల్‌కు బాస్‌గా నటిస్తోందని తెలిసింది. మొత్తం మీద సండైక్కారి చిత్రంతో ఆ అమ్మడి రీఎంట్రీ ఇవ్వనునంది.